Pages

khadarvalidietplan

 ప్రకృతి మాతకు నీరాజనం
    ప్రగతి అంటే ఏమిటి ?
                       ప్ర -అంటే  అతి ఉన్నతమైనది. -స్వర్గం .
                       గతి - అంటే - మార్గం.
         ప్రగతి అంటే అత్యున్నతమైన మార్గాన్ని చూపించేది .పచ్చని చెట్లతో , ఔషధ మొక్కలు, మూలికా మొక్కలు, దేశవాళీ రకం ఆవులు - మేలుజాతి ఎద్దులు,  కాలుష్యరహిత
వాతావరణం ఉన్నప్పుడే భూమిపై స్వర్గం కనిపిస్తుంది. విదేశీ మోజులో పడి, టెక్నాలజీ  వెంట పరుగులు తీస్తూ మనం మన పవిత్రమైన భారతీయ సంస్కృతి ,సంప్రదాయాలను మర్చిపోతున్నాము. ప్రకృతిని , ఆవులను నిర్లక్ష్యం చేస్తూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాము. కాలుష్యభరితమైన వాతావరణంలో నివసిస్తూ  అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నాము. ఎప్పుడైతే మనం ప్రకృతిని విస్మరించామో అప్పుడే  మనుష్యులకు ఈ దుర్గతి పట్టింది.ప్రగతి తిరిగి మన ప్రాచీన భారతీయ సంస్కృతిని ,సంప్రదాయాలను జీవింప చేయడానికి తన వంతు కృషిని చేస్తోంది. మనం ఎప్పుడైతే తిరిగి వృక్షాలను , ఆవులను ప్రేమించి, పూజిస్తామో అప్పుడే మనకు  సద్గతి ప్రాప్తిస్తుంది.
             "వృక్షో రక్షతి రక్షితః" - "గో సంరక్షణ"   అన్నది ప్రగతి యొక్క నినాదం


                                     "గో సంరక్షణ "
                                " దేశి ఆవులు వర్థిలాలి"
           భారతీయ సంస్కృతి ,సంప్రదాయాలలో  గోవులకు ప్రముఖమైన స్థానం  ఉంది. కృష్ణుడి చుట్టూ ఎల్లప్పుడూ గోమాతలు, లేగదూడలు తిరుగాడుతూ ఉండేవి. చుట్టూ చెట్లు, చుట్టూ ఆవులు  -అదే కృష్ణ తత్త్వం -మోక్ష మార్గం. ప్రాచీన కాలంలో గోవులు అడవులలో, పచ్చిక బయళ్ళలో  స్వేచ్ఛగా  తిరుగాడుతూ ఔషధ మొక్కలను తింటూ ఉండేవి. అందువల్ల వాటినుండి సేకరించిన   పాలు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి అమృతతుల్యంగా ఉండేవి. ఆ పాల ద్వారా వచ్చిన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఎన్నో ఔషధ గుణాలను కలిగి బలవర్ధకమైన ఆహారంగా ఉండేవి. ఆవులు పంటపొలాలలో తిరుగు తున్నపుడు వాటి గిట్టలలో ఉండే ధూళి వల్ల   భూమిలో హ్యూమస్ అనేది బాగా వృద్ధి చెంది నేల సారవంతమయ్యేది. తద్వారా పంటలు బాగా పండేవి . ఆవులనుండి సేకరించే ప్రతిది ఔషదాలుగా ఉపయోగపడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు . కానీ నేడు గోవులను షెడ్లలో ఉంచి అక్కడే ఎటువంటి ఔషధ విలువలు లేని మేత వేస్తూ పెంచుతున్నారు. అందుకే నేటి పాలలో పోషకవిలువలు ఉండటం లేదు.  

No comments:

Post a Comment